చెవిరెడ్డిపై పోక్సో కేసు.. బాధితురాలి తండ్రి ఏమన్నారంటే?

చెవిరెడ్డిపై కేసు విషయంలో తనను పోలీసులు బలవంతంగా తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని బాలిక తండ్రి తెలిపారు

Update: 2024-12-01 06:53 GMT

చెవిరెడ్డిపై కేసు విషయంలో తనను పోలీసులు బలవంతంగా తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని బాలిక తండ్రి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తెపై దాడి జరిగిందని, తామే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమాచారమిచ్చామన్నారు. తాము రమ్మంటేనే ఆయన వచ్చారన్నారు. ఆయనపై కేసు పెట్టాలని తాను చెప్పలేదని బాలిక తండ్రి తెలిపారు. తన బిడ్డకు సాయం చేయడానికి వచ్చిన వారిపై తాను ఎందుకు కేసు పెడతానని, అది పాపం కాదా? అని ప్రశ్నించారు.

తన కుమార్తెపై దాడి చేసిన వారికి...
తన కుమార్తెపై దాడి చేసిన వారిని శిక్షించాలని మాత్రమే కోరారని చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు చెప్పిన చోట మాత్రమే సంతకం చేస్తే చివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీనేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కేసులతో పార్టీ నేతలను,కార్యకర్తలను భయపెట్టలేరని అన్నారు.


Tags:    

Similar News