జీవీరెడ్డికి చంద్రబాబు సుతిమెత్తంగా హెచ్చరికలు

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు.

Update: 2025-02-23 02:36 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. సంస్థలో గత రెండు మూడు నెలల్లో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు జీవీ రెడ్డి వివరించారు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదని చంద్రబాబు సుతిమెత్తంగా హెచ్చరించినట్లు తెలిసింది. సమస్యను ముందుగా మంత్రి దృష్టికి లేదా ప్రధాన కార్యదర్శి దృష్టికి తేవాల్సిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఐఏఎస్ అధికారులపై...
ఐఏఎస్ అధికారులపై ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, శాఖలో ప్రక్షాళన చేయాలనే ఆలోచన మందిదే కానీ విధానం కూడా బాగుండాలి అని జీవీరెడ్డికి సూచించారు. ఐ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించకూడదన్న చంద్రబాబు ఏ సమస్య ఉన్నా తన వద్దకు తీసుకురావాలి కానీ ఇలా రచ్చ చేయకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News