అమాంతం పెరిగిన విద్యుత్తు వినియోగం

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు మండిపోతుండటంతో గృహ వినియోగదారులు ఎక్కువ వినియోగం చేస్తున్నారు

Update: 2023-05-11 06:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు మండిపోతుండటంతో గృహ వినియోగదారులు ఎక్కువ వినియోగం చేస్తున్నారు. ఏసీలు, కూలర్లు వాడటంతో ఒక్కసారిగా విద్యుత్తు వినియోగం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో అండ్ జెన్‌ కో అధికారులు చెబుతున్నారు. ఎండలు, ఉక్కబోత పెరిగిన విద్యుత్తు వినియోగానికి కారణమని చెబుతున్నారు.

ఎండలతో...
పెరిగిన వినియోగంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. సింహాద్రి ఎన్‌టీపీసీలో నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో రెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఎండాకాలంలో పవర్ కట్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచే పనిలో ఉన్నారు.


Tags:    

Similar News