Visakha : విశాఖలో కరోనా భయం
విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి
Corona virus cases are increasing in Visakhapatnam
విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా పది కేసులు నమోదు అయ్యాయి. దీంతో విశాఖ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రానున్న కాలంలో ఎక్కువ సంఖ్యలో కేసులు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రానున్న కాలంలో...
ఇక రానున్నది పండగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం కోరుతుంది. అలాగే రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో విశాఖలో కేసులు నమోదు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని చర్యలు చేపట్టింది.