ఏపీలో ఆరు జిల్లాల్లో జీరో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా ఏపీలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు

Update: 2022-04-01 01:12 GMT

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా ఏపీలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,532 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.

ఒక్క కేసు కూడా..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,551 గా ఉంది. 251 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,31,971 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లోనూ కరోనా అదుపులోకి వచ్చింది. చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఏపీ పదమూడు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News