తెలంగాణ కరోనా అప్‌డేట్

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు ఆరు వందలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2022-08-12 03:07 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు ఆరు వందలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 605 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు. నమోదయిన కేసుల్లో 231 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయి. నగరంలో ఎక్కువ మంది కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని, మాస్క్ ధరించకపోతే జరిమానా విధిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదని, మాస్క్ లను ధరించడం లేదని పేర్కొన్నారు.

యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,27,383 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,18, 552 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 992 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి శాతం తెలంగాణలో 98.93 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,720 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News