మరోసారి కాంగ్రెస్ తో కలసి బరిలోకి టీడీపీ

తాజాగా అండమాన్ నికోబార్ లో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ , టీడీపీలు కలసి పోటీ చేస్తున్నాయి

Update: 2022-02-04 02:58 GMT

కాంగ్రెస్ కు, టీడీపీకి తొలి నుంచి పడదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది. అయితే 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోట ీచేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలు కలసి ప్రచారం నిర్వహించారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చంద్రబాబు దూరంగా పెట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో....
అయితే తాజాగా అండమాన్ నికోబార్ లో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ , టీడీపీలు కలసి పోటీ చేస్తున్నాయి. అండమాన్ నికోబార్ లోని రెండు పార్టీల నేతలు సమావేశమై కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వార్డులను పంచుకున్నారు. మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈమేరకు కాంగ్రెస్ నేత రంగలాల్ హల్దార్, టీడీపీ నేత మాణిక్యాల రావు లు ఒప్పందం కుదుర్చుకున్నారు.


Tags:    

Similar News