Andhra Pradesh : ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతథం
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేయడంతో ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేయడంతో ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి. అలాగే టెట్ పరీక్షలు కూడా యధాతధంగా జరుగుతాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. టెట్ తో పాటు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో ఆరుగురు అభ్యర్థులు పిటీషన్ వేశారు. అభ్యర్థులు లేవనెత్తిన పిటీషన్ లో సరైన కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ను సంప్రదించాలని...
ఏదైనా సమస్యలుంటే నేరుగా హైకోర్టును సంప్రదించాలని సుప్రీంకోర్టు పిటీషనర్లకు సూచించింది. వీరు వేసిన పిటీషన్లను కొట్టివేసింది. టెట్, డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. డీఎస్సీ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకూ నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల్లో మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే.