దెందులూరు సభలో దూకుడు తగ్గిందా?

పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా నిధులను ఆయన విడుదల చేశారు

Update: 2023-03-25 08:04 GMT

పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా నిధులను ఆయన విడుదల చేశారు. దెందులూరులో జరిగిన సభలో ఆయన కేవలం పథకాలు, సంక్షేమ కార్యక్రమాల మీదనే మాట్లాడారు. విపక్షాలపై విమర్శలు ఈ సభలో చేయకపోవడం విశేషం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు 14వేల కోట్లు కాగా, నేడు బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయని జగన్‌ తెలిపారు. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారన్నారు.

రోల్‌మోడల్‌గా
దేశానికి రోల్‌మోడల్‌గా ఆంధ్రప్రదేశ్ లో పొందుపు సంఘాలు నిలుస్తున్నాయన్న జగన్, బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించామని తెలిపారు. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు. ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం రుణాలు మాఫీచేస్తానని చెప్పిన చంద్రబాబు వారిని నిలువునా ముంచేశారన్నారు. 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారని జగన్ ఆరోపించారు.
2.25 లక్షల కోట్లు...
మూడు వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు కారణంగా ఏర్పడిందన్నారు. తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చామని జగన్ తెలిపారు. 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించామన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వం మనదని జగన్ తెలిపారు. ఈ 45 నెలల కాలంలో ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామన్నారు.


Tags:    

Similar News