వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు నేడు
నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు
ys jagan
నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదును ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేదలకు చెందిన మహిళల ఖాతల్లో పదిహేను వేల చొప్పున జమ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 658.60 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మొత్తం 4,39,068 మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
మార్కాపురానికి....
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 9.55 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. స్థానిక కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పడు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి లబ్దదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.