నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి
నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రానున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సూపరిపాలన కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉత్తరఖాండ్ సీఎం రానుండటంతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పుష్కర్ సింగ్ ధామీ నేడు మదనపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మదనపల్లెలో...
ఈరోజు మదనపల్లె అన్నమయ్య సర్కిల్ లో అటల్ బీహార్ వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ లో ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొననున్నారు. పుష్కర్ సింగ్ ధామీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అటల్ మోదీ సుపరీపాలన యాత్ర రాష్ట్ర కన్వీనర్ నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, సత్యకుమార్ లు పాల్గొననున్నారు.