ఆధార్ కేంద్రాలకు వెళ్లాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
తెలుగు రాష్ట్రాలలో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
తెలుగు రాష్ట్రాలలో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. లాగిన్స్ పై అరా తీస్తున్నారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు గర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డులను పలు పంచాయితీలల్లో జారీ చేసినట్లు గుర్తించారు. నెట్ సెంటర్ పేరుతో ప్రజల వద్ద నిర్వాహకులు దోపిడీకి పాలు పడుతున్నారు.
బ్యాంక్, పోస్టాఫీసుల్లో మాత్రమే...
బయట ఎక్కడ ఆధార్ నమోదు కేంద్రాలు లేవని, ప్రస్తుతం బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లల్లో మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేని ఆధార్ కేంద్రాలు గుర్తించి సిజ్ చెయ్యాలని ఇప్పటికే పలు తహసీల్దార్, కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రజలు కూడా నెట్ సెంటర్లకు వెళ్లి మోసపోవద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.