వైసీపీకి షాకిచ్చిన నెల్లూరు నేత

నెల్లూరు రాజకీయం మలుపులు తిరుగుతుంది.

Update: 2025-12-13 07:50 GMT

నెల్లూరు రాజకీయం మలుపులు తిరుగుతుంది. తాజాగా 42 వార్డు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీ లోకి చేరారు. టీడీపే కండువా కప్పి పార్టీలోకి మంత్రి నారాయణ ఆహ్వానించారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్ పాల్గొన్నారు. ఈ నెల 18 న మేయర్ పై అవిశ్వాసం నేపథ్యంలో రసకందాయం గా సింహపురి రాజకీయం మారింది. షేక్ కరీముల్లా,42 వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీ లో కరీముల్లా చేరారు.

అభివృద్ధి కోసమే...
తమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అధికార పార్టీ సహకారం కావాలని కరిముల్లా పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన తరవాత అభివృద్ధి కొనసాగించలేకపోయానని తెలిపారు. మంత్రి నారాయణ నేతృత్వంలో పనిచేయాలనే టీడీపీ లో చేరానని కరిముల్లా తెలిపారు. మంత్రి నారాయణ గారు నెల్లూరు లో చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీ లో చేరానని కరిముల్లా చెప్పారు.


Tags:    

Similar News