Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిట లాడుతుంది
విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిట లాడుతుంది. భవానీ దీక్షల విరమణ కోసం పెద్ద సంఖ్యలో భవానీ మాలధారులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ భవానీ మాల దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ భవానీ మాల దీక్షల విరమణ కోసం ఆలయ అధికారులు భక్తులు ఇబ్బందుల పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భవానీ మాల ధరించి...
భవానీ మాల ధరించిన వారికి ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ ఆలయంలో అంతరాలయ దర్శనాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రి పై ఇరుముడులు సమర్పించి దీక్ష విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అమ్మ వారి దర్శనం కై భవానీ మాలదారులు పోటెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.