నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా

నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా చేశారు.

Update: 2025-12-14 02:36 GMT

నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం వస్తున్న సమయంలో ఆమె ముందుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ను కలసి తాను రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లు స్రవంతి తెలిపారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను బెదిరించి తమ పార్టీలోకి తీసుకెళుతున్నారని ఆమె టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు.

టీడీపీపై ఆరోపణలు...
నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు మంది కార్పొరేటర్లుండగా గత ఎన్నికల్లో అందరూ వైసీపీ నుంచి గెలిచిన వారే. శాసనసభ ఎన్నికల తర్వాత 42 మంది కార్పొరేటర్లు టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. అయితే ఇటీవల వైసీపీలోకి వచ్చిన ఐదుగురు కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని, కేసుల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి పొట్లూరి స్రవంతి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News