గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం

ఆదివారం తెల్లవారుజామున గుడివాడలో అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2025-12-14 05:01 GMT

ఆదివారం తెల్లవారుజామున గుడివాడలో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని అద్దేపల్లి కాంప్లెక్స్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాణ నష్టం ఏమీ లేదు కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదం జరిగిన స్థలానని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అగ్నికి అహుతయిన కాంప్లెక్స్ లోని దుకాణాలను చేసిన ఎమ్మెల్యే.... అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం చెప్పారు.

ప్రమాద స్థలాన్ని....
ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. వారికి ప్రభుత్వపరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తానని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గుడివాడలో ఇటీవల తరచు అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు.


Tags:    

Similar News