Chandrababu : నేడు నారావారిపల్లెకు చంద్రబాబు

నేడు నారావారిపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2026-01-12 04:00 GMT

నేడు నారావారిపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి నుంచి పదిహేనో తేదీ వరకు స్వగ్రామంలో జరిగే సంక్రాంతి పండగకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళ్లనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోనున్నారు.

నాలుగు రోజుల పాటు...
నాలుగు రోజుల పాటు సొంత గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు. 140 కోట్ల రూపాయల విలువైన పలు పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. 20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు.


Tags:    

Similar News