Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2026-02-09 03:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మంత్రులు, కార్యదర్శులతో సమావేశం అనంతరం సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రేపు మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తో పాటు వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

రేపు వివిధ కార్యక్రమాల్లో...
మరొకవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారని తెలిసింది. అయితే ఎవరెవరిని కలవాలన్న దానిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది. అమిత్ షాతో భేటీకి చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. రేపు తిరిగి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News