Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళుతున్నారు. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా లభించడంతో రేపు ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
అమిత్ షాతో భేటీ...
బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అదనపు నిధులు కేటాయించాలని చంద్రబాబు అమిత్ షా ను కోరే అవకాశాలున్నాయి. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా చంద్రబాబు అమిత్ షాతో చర్చించనున్నారు. రేపు రాత్రికి తిరిగి అమరావతికి చంద్రబాబు రానున్నారు.