వైసీపీలో అంతర్గత విభేదాలు.. యనమల సంచలన కామెంట్స్

వైసీపీలో అంతర్గతంగా విభేదాలున్నట్లుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు

Update: 2026-01-08 07:44 GMT

వైసీపీలో అంతర్గతంగా విభేదాలున్నట్లుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైఎస్ జగన్ కు తెలియకుండా అసెంబ్లీకి హాజరయినట్లు కొందరు ఎమ్మెల్యేలు రిజిస్టర్ లో సంతకాలు చేశారన్నారు. ఇది జగన్ కు తెలియకుండా చేసిన పనేనని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ అసెంబ్లీకి వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు సూచించినా జగన్ మాట పెడచెవిన పెట్టడమే కదా? అని యనమల అన్నారు.

అసెంబ్లీకి వెళ్లకుండానే...
ఇటీవల జరిగిన ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా సంతకాలు చేసి ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ విషయం బయటపడటంతో వైసీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ మాటను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు వ్యవహరించడాన్ని పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.


Tags:    

Similar News