Weather Report : ఏపీకి తప్పిన ముప్పు..అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2026-01-08 04:20 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న కొద్ది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిచింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. రానున్న కొద్ది గంటల్లోనే అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తమిళనాడులో మాత్రమే వర్షాలు పడతాయని, ఏపీలో వానలు పడే అవకాశాలు లేవని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

వాయుగుండం ప్రభావంతో...
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వానలు పడకపోయినా కొన్ని చోట్ల తేలిక పాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మిగిలిన రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాయుగుండం ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. కానీ వాయుగుండం ప్రభావంతో పొగమంచుతో పాటు చలి కూడా పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో చలితీవ్రత...
తెలంగాణలో చలితీవ్రత మరో వారం రోజుల పాటు కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 12వ తేదీ వరకూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కోల్డ్ వేవ్ తో ప్రజలు ఇబ్బందులు పడతారని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగలు ఉష్ణోగ్రతలు కూడా ఇరవై ఐదు లోపు ఉంటాయని, రాత్రి ఉష్టోగ్రతలు పదిహేను డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీలు నమోదవుతున్నాయి. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News