తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయనుంది. జనవరి 9 వ తేదీకి సంబంధించిన ఎస్.ఎస్.డి. టోకెన్లు మధ్యాహ్నం నుంచి ఇవ్వనున్నారు. గతంలో మాదిరిగానే ఈరోజు కారోజు టోకెన్లు ఇచ్చి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
టోకెన్లు ఇచ్చే ప్రాంతాలివే
శ్రీనివాసం - ఆర్టీసీ బస్టాండ్ దగ్గర
విష్ణు నివాసం - రైల్వే స్టేషన్ ఎదురుగా
భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర
శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు "అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్" లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి.