నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్‌ అమరావతి

నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్‌ అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

Update: 2026-01-08 05:26 GMT

నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్‌ అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకల నిర్వహణను ఏపీ ప్రభుత్వం ఘనంగా తీసుకుంది.

హోమ్ బోట్లు...
ఉత్సవాల్లో సినీ, సాహిత్యరంగ ప్రముఖులు పాల్గొననున్నారు. ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో హౌస్‌బోట్ల ప్రారంభించనున్నారు. కృష్ణానదిలో కేరళ తరహా ఫ్లోటెడ్ హోమ్ బోట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ బోట్ ఒక కుటుంబానికి రోజుకు ఎనిమిది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుది. ఈ బోట్లను నేడు పున్నమిఘాట్ దగ్గర చంద్రబాబు ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News