Ys Jagan : మళ్లీ మొదటికి జగన్ కేసుల విచారణ
వైసీపీ అధినేత జగన్ ఆదాయానికి మించిన కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది
వైసీపీ అధినేత జగన్ ఆదాయానికి మించిన కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై ఇప్పటిదాకా జరిగిన వాదనలు మళ్లీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఆదాయానికి మించిన ఆస్తులను ఎనిమిది మంది న్యాయమూర్తులు విచారించారు. వారు మారిపోయారరు.
బదిలీలు కావడంతో...
వారు బదిలీ కావడంతో కేసులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అనేలా సాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇప్పటికే ఇద్దరు నిందితులు మృతి చెందగా.. ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ పన్నెండేళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. మరోసారి న్యాయమూర్తి బదిలీ కావడంతో మరికొన్ని రోజులు వాదనలు వింటానికే సరిపోతుందంటున్నారు.