పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం

పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి

Update: 2025-12-22 04:28 GMT

పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు చంపేశారు. పల్నాడు జిల్లాలోని అరిగొప్పుల గ్రామానికి చెందిన అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. వీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఈ హత్యలో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

అన్నదమ్ములను...
మృతి చెందిన వారు హనుమంతు, శ్రీరామ్మూర్తిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఇందులో రాజకీయకోణం ఏమీ లేదని పోలీసులు అంటున్నారు. ఇద్దరినీ వేర్వేరు ప్రాంతాల్లో వేటకొడవళ్లతో నరికి చంపడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు ఇన్ ఛార్జి మంత్రి గొట్టి పాటి రవి కుమార్ ఎస్సీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.


Tags:    

Similar News