Andhra Pradesh : నేడు జనసేన పార్టీ సమావేశం

నేడు జనసేన పార్టీ సమావేశం జరగనుంది

Update: 2025-12-22 02:38 GMT

నేడు జనసేన పార్టీ సమావేశం జరగనుంది. కూటమి తరుపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ ఛైర్మను్లు, డైరెక్టర్లు, నీటి సంఘాలతో పార్టీ అధినేత పపన్ కల్యాణ్ సమావేశమవుతారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పదవులు పొందిన అందరూ హాజరు కానున్నారు.

పవన్ దిశానిర్దేశం...
వారితో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. గత రెండేళ్ల నుంచి వరసగా నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎలా వ్యవహరించాలి?ఏం చేయాలి? పార్టీతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంపై పవన్ కల్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ లో మరింత రాజకీయ ఎదుగుదలకు ఈ పదవిని ఉపయోగించుకుని ప్రజల మన్ననలను పొందాలని సూచించనున్నారు.


Tags:    

Similar News