Andhra Pradesh : కూటమి సర్కార్ కు చేగొండి షాక్
కూటమి ప్రభుత్వానికి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు.
కూటమి ప్రభుత్వానికి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. మొత్తం 45 అంశాలతో కూడిన లేఖను చేగొండి హరిరామజోగయ్య రాశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను రెండేళ్లవుతున్నా అమలుచేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనిఫేస్టోను ఇద్దరు ప్రకటించారని,వారి మాటలను నమ్మి ప్రజలు గెలిపించినా వాటిని అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు...
ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తామని చెప్పిన నేతలు తమ మాటను నిలబెట్టుకోలేకపోయారకని తప్పుపట్టారు. హామీలను అమలు చేయకపోవడమే కాకుండా అప్పులు కూడా అధికంగా చేయడం పట్ల చేగొండి హరిరామజోగయ్య అసహనంవ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయిందని అన్నారు. గోదావరి జిల్లాల అభివృద్ధిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించిందని చేగొండి హరిరామజోగయ్య తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.