Andhra Pradesh : వాహనదారులకు ఏపీ పోలీస్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-22 07:51 GMT

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ లోనే ఈ చలాన్లను చెక్ చేసుకునే వీలు కల్పించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలను వాట్సాప్ లోకి అందుబాటులో తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ లో పోలీసు సర్వీసులు చేరడంతో ముఖ్యంగా వాహనాల చలాన్ల విషయంలో వినియోగదారులు చెక్ చేసుకునే వీలుంది.

వాట్సాప్ లోనే ఇక...
అయితే ఇందుకోసం 9552300009 నెంబరుకు Hi అని మెసేజ్ చేయాలి. అలా మెసేజ్ చేసిన వెంటనే కేటగిరిలోకి వెళితే పోలీసు శాఖ అందులో కనిపిస్తాయి. ఈ సేవల్లో FIR, FIR స్టేటస్ తో పాటు ఈ చలాన్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. వెహికల్ నెంబరు ఎంటర్ చేస్తే ఆ వాహనంపై నమోదయిన ఈ చలాన్ల వివరాలు తెలుస్తాయి. వెంటనే అక్కడే యూపీఐ ద్వారా జరిమానాలను చెల్లించవచ్చు.


Tags:    

Similar News