Andhra Pradesh : కోడి మాంసం తినొద్దు.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నమయ్య జిల్లాలోని ఇరవై నాలుగు మండలాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. పౌల్ట్రీ ఫామ్ లలో ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. వైరస్ మరింత విస్తరంగా ఉండకుండా ఉండేందుకు పారిశుద్ధ్యం పనులను వేగవంతం చేశారు.
వేల సంఖ్యలో...
చిత్తూరు జిల్లాలో కోళ్లు వేల సంఖ్యలో చనిపోవడంతో బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలను నిషిద్ధ ప్రదేశాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. పది రోజుల పాటు కోడి గుడ్లను, కోడిమాంసం జోలికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. నలభై ఐదు మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టడమే కాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తుంది.