Bird Flu : బర్డ్ ఫ్లూ... ఉంది కోడి మాంసం తినొచ్చా?

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. దీనిపై పశువైద్యాధికారులు వివరణ ఇచ్చారు

Update: 2025-02-17 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. నిన్నటి వరకూ ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమయిన బర్డ్ ఫ్లూ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు కూడా వ్యాపించింది. వందల సంఖ్యలో కోళ్లు మరణించడంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేదని అధికారులు చెబుతున్నారు. వంద డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి చేసి తింటే ఏమీ కాదని, భయాందోళనలు చెందాల్సిన పనిలేదని పశువైద్యాధికారులు తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు...
తెలంగాణకు కోళ్లు ఏపీ నుంచి రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశారు. చికెన్ తింటే వైరస్ సోకుతుందన్న ప్రచారం నమ్మవద్దని కూడా పలువురు పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని కూడా చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.


Tags:    

Similar News