Talliki Vandanam : తల్లికి వందనంపై బిగ్ అప్ డేట్
తల్లికి వందనంపై బిగ్ అప్ డేట్ వచ్చింది. తల్లికి వందనం పథకం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తల్లికి వందనంపై బిగ్ అప్ డేట్ వచ్చింది. తల్లికి వందనం పథకం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అందని వారికి అవకాశం కల్పించేందుకు వీలుగా షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 16 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకూ పథకం అందని వారు దరఖాస్తు చేసుకోవచ్చు
షెడ్యూల్ ఇదే...
జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆ దరఖాస్తులను అధికారులు పరిశీలించి వారిలో అర్హులైన వారిని తిరిగి ఎంపిక చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 30వ తేదీన 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శిస్తామని చెప్పింది. జులై 5వ తేదీన దరఖాస్తుదారులల్లో అర్హులైన వారికి తల్లికి వందనం పథకం నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది.