Andhra Pradesh : లంచం తీసుకుంటూ ఆర్అండ్‌బీ ఏఈ

ఆళ్లగడ్డ ఆర్అండ్‌బీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ డి. దస్తగిరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు

Update: 2025-09-30 04:18 GMT

కర్నూలు జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి దొరికిపోయాడు. ఆళ్లగడ్డ ఆర్అండ్‌బీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ డి. దస్తగిరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ డి. సోమన్న తెలిపిన వివరాల ప్రకారం ఒక కాంట్రాక్టర్‌ నుంచి ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ పనుల కోసం 55 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడు.

కాంట్రాక్టర్ నుంచి...
కాంట్రాక్టర్‌ రమేష్‌ ముందుగా 40 వేల రూపాయలు ఇచ్చాడు. మిగతా 15 వేల రూపాయలు కోరడంతో రమేష్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని ఏఈ ని లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఏఈ దస్తగిరిని న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఏసీబీకి చిక్కిన ఏఈ పై కేసు నమోదు చేశారు.























Tags:    

Similar News