ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఏపీ ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు

Update: 2023-01-21 04:48 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఏపీ ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సంఘం గుర్తింపును రద్దు చేయాలంటూ చీఫ్ సెక్రటరీ జవహరెడ్డిని కోరారు. ఇటీవల ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై ఏపీ ఎన్జీవోలు తప్పుపడుతున్నారు.

రోసా నిబంధనలను....
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను కొన్ని శక్తులు వెనక ఉండి నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. రోసా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుమతి ఇచ్చారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంఘం గుర్తింపును రద్దుచేయాలని కోరారు.


Tags:    

Similar News