చంద్రబాబు కడుపుమంటతోనే అలా?
గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ప్రవర్తన ఆక్షేపణీయమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ప్రవర్తన ఆక్షేపణీయమని తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బడ్జెట్ ప్రసంగంలో ఆ పార్టీ వ్యవహారశైలి నిదర్శనమని జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. ఆయన పేరు చెబితే వెన్నుపోటు పథకం తప్ప మరేదీ గుర్తుకు రాదని జగన్ మండి పడ్డారు.
హమీలకు ఏనాడైనా విలువిచ్చారా?
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలకు ఏనాడు విలువ ఇవ్వలేదని జగన్ అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా తమ పార్టీకే ప్రజలు విజయం కట్టబెట్టిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు ఆశీర్వదించారని జగన్ అన్నారు. కరోనా కష్టసమయంలోనూ ప్రజలను తమ ప్రభుత్వం విస్మరించలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని జగన్ అన్నారు.