Andhra Pradesh : ఏపీలో ఉప ఎన్నికలు తప్పవా? కూటమి సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంటుందా?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది

Update: 2026-01-09 09:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రడు పడే పదే చెబుతున్న మాట ఏంటంటే.. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల గురించి. సభకు హాజరు కాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని అయ్యన్న ప్రతి సభలో ప్రశ్నిస్తున్నారు. ఒక ఉద్యోగి విధులకు హాజరు కాకుండా ఉంటే జీతాలు చెల్లిస్తామా? అని ఆయన వేస్తున్న ప్రశ్నలు సహేతుకమే. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన సభకు పంపిన ప్రజల తీర్పును కాదని తాము వెళ్లమంటే వెళ్లమని బాసిపట్లు వేసుకుని కూర్చోవడం వారిష్టమే కావచ్చు. కానీ సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఎవరైనా తప్పుపట్టాలని అందరూ అంగీకరించాల్సిందే.

అనర్హత వేటు వేయాలంటే...
ఇటీవల జరుగుతన్న పరిణామాలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎథిక్స్ కమిటీ లోనూ సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు జీతాలు తీసుకోవడంపై చర్చ జరిగింది. వైసీపీలో మొత్తం పదకొండు మంది శాసనసభ్యులుంటే అందులో ఆరుగురు వరకూ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నట్లు తేలింది. వారు అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళుతున్నట్లు తేలడంతో ఇక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించింది. అయితే అరవై రోజుల పాటు సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. రానున్న శీతాకాలసమావేశాలతో ఆ గడువు కూడా ముగిసి పోతుంది.
చంద్రబాబు అంగీకరిస్తారా?
ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత కనీసం అరవై పనిదినాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. లేకుంటే వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది. చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ సూచించే అవకాశాలయితే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందన్నది చూడాలి. ఎందుకంటే ఆరు చోట్ల ఉప ఎన్నికలంటే అది కూటమి ప్రభుత్వానికి సవాల్ అవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. రెండేళ్ల తర్వాత తిరిగి ఉప ఎన్నికలకు పెద్ద సంఖ్యలో వెళ్లి ఓటమి పాలయితే ప్రభుత్వంపై వ్యతిరేకత అని రాష్ట్రమంతటా ప్రజలు భావిస్తారు. అందుకే గైర్హాజరయ్యే వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశాలు జీరో శాతం అనే చెప్పాల్సి ఉంటుంది. అలాగని ప్రభుత్వ పనితీరును మూడేళ్ల ముందే బేరీజు వేసుకోవాలని యత్నిస్తే మాత్రం ఉప ఎన్నికలు అనివార్యం. కానీ మొదటి దానికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయన్నది చంద్రబాబు నాయుడు ను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది. మరి ఏమవుతుందన్నది చూడాలి.














Tags:    

Similar News