Andhra Pradesh : కూటమి ప్రభుత్వం మహిళలకు సూపర్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-02-08 04:24 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పథకం అమలుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఉచితంగా యాభై వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ మహిళలకు పథకాల అమలు విషయంలో ముందుంటారు. డ్వాక్రాసంఘాల ఏర్పాటు చేసిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా గతంలోనే చేశారు. వారికి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇప్పుడు తాజాగా వారికి స్వయం ఉపాధి పథకం అమలుచేస్తే వారు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారని భావించి చంద్రబాబు విశ్వసిస్తారు. పట్టణాలు, నగరాల్లో మహిళలకు ఆర్థిక చేయూతను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎగ్ మార్ట్ ల ఏర్పాటుకు...
ఇందుకోసం పట్టణంలో ఉండే పేద మహిళల కోసం నూతనంగా ఎగ్ మార్ట్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు పది ఎగ్ మార్ట్ ల చొప్పున రాష్ట్రంలో 260 మార్ట్ లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో ఒక్కొక్క ఎగ్ మార్ట్ కు యాభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వనుంది. ఇందుకోసం ఎంపికయిన మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ యాభై వేల రూపాయలలో ముప్ఫయి ఐదు వేల రూపాయలతో ఎగ్ కార్ట్ ను ఏర్పాటు చేసుకోవాలి. మరో పదిహేను వేల విలువైన కోడిగుడ్లను సరఫరా చేస్తారు. గుడ్డు పౌష్టికాహారం కావడంతో వాటిని తినేందుకు కూడా అందరూ ఇష్టపడతారు.
గుడ్డుతో వివిధ రకాల ఆహార పదార్థాలను...
గుడ్డుతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించుకునే వీలును పట్టణ పేదలకు కల్పించారు. వీరు యాభై వేల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్ మార్ట్ లను జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిన్ రోడ్లలో, ముఖ్యమైన ప్రాంతాల్లో వీరికి ఎగ్ కార్ట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు మంజూరు చేస్తాయి. అయితే ఈ ఎగ్ మార్ట్ లు పెట్టుకోవాలంటే ముందుగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పదిహేను అంశాలు ఇందులో ఉంటాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ ఎలాంటి ప్రభుత్వ సాయాన్ని నోచుకోని వారు ఈ ఎగ్ మార్ట్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటున్నారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి ఎగ్ మార్ట్ లను మార్చి నుంచి ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.


Tags:    

Similar News