Nara Lokesh : రేపు ప్రధానితో లోకేశ్ భేటీ.. జగన్ విషయంపైనేనా?

రేపు ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు.

Update: 2025-09-04 08:28 GMT

రేపు ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈరోజు ళ రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న మంత్రి లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారని తెలిసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్న నేపథ్యంలో లోకేశ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయాలపై...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, జగన్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మోదీతో లోకేష్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జగన్ ను అరెస్ట్ చేయడంపై కూడా ప్రధానితో చర్చించే అవకాశముందని అంటున్నారు. దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో లోకేష్, మోదీ భేటీ ఉత్కంఠ రేపుతుంది. ఈ భేటీ తర్వాత ఏపీలో పలు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.


Tags:    

Similar News