Andhra Pradesh : నేడు రెండో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-09-19 02:33 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే ప్రశ్నోత్తరాల తర్వాత జీరో అవర్ ఉండనుంది. అనంతరం కొన్ని అంశాలపై చర్చ ఉండనుంది. కొన్ని కీలక బిల్లులను నేడు శాసనసభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఈరోజు ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఎనిమిది రోజుల పాటు...
అయితే బీఏసీ లో నిర్ణయించిన దాని ప్రకారం శాసనసభ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకూ ఎనిమిది రోజులు పాటు జరగనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకూ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సమావేశాలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం సాయంత్రం వరకూ జరిగే అవకాశముంది. అన్ని అంశాలపై శాసనసభ చర్చించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News