నేడు గవర్నర్ ను కలవనున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను నేడు తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను నేడు తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. గుడివాడలో జరిగిన క్యాసినోపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈరోజు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తో సమావేశమై తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించనుంది.
క్యాసినో వ్యవహారంపై....
గవర్నర్ క్యాసినో వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని టీడీపీనేతలు కోరనున్నారు. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారకుడైన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని వారు గవర్నర్ ను కోరనున్నారు.