Ys Jagan : ఏపీలో వారందరికీ జగన్ సంక్రాంతి గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగకు ముందు శుభవార్త చెప్పింది
chief minister ys jagan will come to hyderabad today.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగకు ముందు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండగ అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే ఎన్ని ఉద్యోగాలు, విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఎదురు చూస్తున్న...
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయితే పెద్ద ఊరట నిచ్చినట్లేనని అంటున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ తీపికబురు పండగకు ముందు ప్రభుత్వం అందించడంతో నిరుద్యోగులు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు.