Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-24 05:08 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదాల చేసింది. గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో యూ.పీ.హెచ్.సి, పీహెచ్.సి. లలో, ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానించినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విజయలక్ష్మి తెలిపారు.

రేపటి నుంచి దరఖాస్తులు...
ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ ,డి ఈ ఓ, ఎఫ్ ఎన్ వో ,శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారాలు వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు...www. Guntur . AP. Govt.in లో అందుబాటులో ఉన్నాయి.


Tags:    

Similar News