Chandrababu : నేడు నగరి నియోజకవర్గానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు నాయుడు నెలలో ఒక శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. పారిశుద్ధ్యం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ వస్తున్నారు.
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో...
అందులో భాగంగా ఈరోజు నగరి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించి అక్కడ స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భారీ భందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. భారీగా తిరుపతి జిల్లా నుంచి కార్యకర్తలు తరలి రానున్నారు.