తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులు ఎవరెవరంటే?
తిరుమల కల్తీ నెయ్యి కేసుపై నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది
తిరుమల కల్తీ నెయ్యి కేసుపై నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది.నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులున్నట్లు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. 12 మందిలో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న కూడా ఉన్నారు. ఎవరెవరికి కమీషన్లు ఇచ్చారనే లావాదేవీల వివరాలు సేకరించిన సీబీఐ సిట్ ఈరోజు ఛార్జిషీట్ దాఖలు చేసింది.
పన్నెండు మందిలో...
2019-24 మధ్య లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని, కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డెయిరీ కీలకపాత్ర పోషించిందని ఛార్జిషీట్ లో సిట్ ేర్కొంది. పాలు, నెయ్యి లేకపోయినా నెయ్యి నాణ్యత బాగుందని గతంలో టీటీడీ అధికారులు నివేదిక అందించారని, గతంలో తిరుమలకు వచ్చిన నెయ్యి నాణ్యతను నిర్ధారణ చేయలేదని, కల్తీ నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డు నాణ్యత దెబ్బతినిందని సీబీఐ సిట్ ఛార్జిషీట్ లో పేర్కొంది.