Tirumala : తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. ఈరోజు కొండకు వెళితే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2026-01-24 03:26 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో పెద్దయెత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా సెలవు కావడంతో వరస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. నిన్నటి వరకూ కంపార్ట్ మెంట్ల వరకే పరిమితమయిన భక్తులు నేడు బయట వరకూ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దాదాపు బయట రెండు కిలోమీటర్ల మేరకు భక్తుల క్యూ లైన్ నిలిచిపోయింది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, పాలను శ్రీవారి సేవకులు నిరంతరం అందిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం కూడా...
తిరుమలలో భక్తుల రద్దీ కొత్త కాదు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు. హుండీ ఆదాయం కూడా అదే సమయంలో భారీగా పెరుగుతూ వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి ఆదాయం నెలలోనే కాదు రోజు వారీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల పాటు మరింత రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. బయట భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. ఇక రేపటి రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది.శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు టీటీడీ రద్దు చేసింది.రేపు సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది.శుక్రవారం స్వామి వారిని 69 వేల 726 మంది భక్తులు దర్శించుకున్నారు.27 వేల 832 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 12 లక్షల రూపాయలు కాగా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News