పేర్ని నానివి అన్నీ అసత్యాలే : అనగాని

భూముల రీసర్వేపై వాస్తవాలు బయటపెట్టానని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు

Update: 2026-01-24 04:05 GMT

భూముల రీసర్వేపై వాస్తవాలు బయటపెట్టానని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జవాబు చెప్పే ధైర్యం లేక వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని తెలిపారు. తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బు సంపాదించుకోవడం పేర్ని నాని, వైసీపీ నేతలకు అలవాటు అని అన్నారు.

ఇంటికే పరిమితం చేసినా...
ప్రజలు ఇంటికే పరిమితం చేసినా పేర్ని నాని ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ సన్యాసం అనే వ్యక్తికి ప్రెస్ మీట్లు పెట్టే అర్హత ఎక్కడిదని, అధికారం లేనప్పుడు పేర్ని నాని జీవితం ఏంటో అందరికీ తెలుసునని, తన నిజాయతీ ఏంటో రేపల్లె, బందరు ప్రజలకు తెలుసునని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు నోటీసులు పంపుతానని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


Tags:    

Similar News