నేడు ఆదోని బంద్
ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు.
ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటయి గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో నేడు ఆదోని బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆదోని పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారాలను మూసివేశారు.
జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని...
బంద్ లో జేఏసీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు. పాఠశాలలు, దుకాణాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఆదోనిని జిల్లా కేంద్రం చేయాలని ప్రభుత్వంపై వత్తిడి పెంచేలా నేడు బంద్ చేస్తున్నట్లు జేఏసీ నేతలు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.