Murder Case : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపిన భార్య

ప్రకాశం జిల్లాలో భార్య వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు.

Update: 2026-01-24 06:50 GMT

ప్రకాశం జిల్లాలో భార్య వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను కడతేర్చే వారు ఎక్కువయ్యారు. మానవీయ విలువలు మంటగలిసిపోయేలా వ్యవహరిస్తున్నారు. తమ సుఖమే ముఖ్యమని భావించి విడాకులు ఇచ్చే అవకాశమున్నప్పటికీ ఆ పనిచేయకుండా భర్తను హతమార్చడం వంటివి చేస్తుండటం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుండటంతో భవిష్యత్ అనేది ఎలా ఉంటుందన్నదిమరింత ఆందోళనకరంగా తెలిపింది.

తమ్ముడి సాయంతో...
పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య హత్య చేసిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ ఘటన పూర్తివివరాలు సేకరించి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి కేసులో జైలు కెళ్లిన భర్తకు బెయిల్ ఇప్పించి మరీ కిరాయి హంతకులతో కలసి పథకం ప్రకారం హత్య చేసింది. ఈ హత్యకు భార్య తమ్ముబడి సహకారం కూడా ఉంది. పెద్ద దోర్నాలకు చెందిన లాలూ శ్రీను డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అయితే అతనికి పేకాట వ్యసనంగా మారి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అయితే సంపాదన కోసం గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించాడు.
కిరాయి హంతకులతో...
అయితే పెద్ద దోర్నాలలో మెకానిక్ షాపు నిర్వహిస్తున్న మృతుడి బావమరిది అశోక్ కుమార్ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు.అతనితో అశోక్ కుమార్ సోదరి ఝాన్సితో పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని తెలిసిన లాలూ శ్రీను భార్యతో తరచూ గొడవ పడేవాడు. దీంతో గంజాయి కేసులో జైలుకు వెళ్లిన లాలూ శ్రీను బయటకు వస్తే తనను చంపుతాడని భయపడిపోయి కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరికి గుంటూరుకు చెందిన పార్థు,శంకర్ కు రెండు లక్షల రూపాయలు సుపారీ చెల్లించి హత్యకు పురమాయించారు. శ్రీనును పెద్దారవీడు మండలలో రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News