కల్యాణదుర్గం మండలంలో చిరుత పులి
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో చిరుత పులి కలకలం రేపుతుంది
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో చిరుత పులి కలకలం రేపుతుంది. దీంతో కల్యాణదుర్గం మండలంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కల్యాణదుర్గం మండలంలోని ముదిగల్లు రోడ్డు గోశాల వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులిని తమ సెల్ ఫోన్ లో బంధించి నెట్టింట వైరల్ చేశారు.
చిరుత జాడ పట్టుకునేందుకు...
చిరుతపులి సంచరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఒంటరిగా పొలాలకు సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు ఆదేశించారు. అలాగే పెంపుడు జంతువులు, పశువులను కూడా బయటకు వదలొద్దని తెలిపారు. కల్యాణదుర్గం మండలంలో చిరుత జాడలు గుర్తించి బంధించేందుకు అటవీశాఖ అధికారుల యత్నం చేస్తున్నారు.