దున్నపోతు పై దాడి చేసిన పెద్దపులి
ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది.
ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. గత కొద్ది రోజులుగా ఇదే ప్రాంతంలో పులి సంచారం గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే తాజాగా బుట్టాయిగూడెం మండలం కోట నాగవరంలో దున్నపోతుపై పెద్దపులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు మరోసారి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దున్నపోతుపై దాడి
అంతర్వేది గూడెం,నాగులగూడెం మీదుగా కోట నాగవరంలో ప్రవేశించిన పులి అక్కడే తిరుగుతుంది. ఎండ్రపాగడ సూర్యరావుకు చెందిన దున్నపోతుపై దాడి చేసి పులి ఈడ్చు కెళ్ళడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పెద్దపులి జాడను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.