Andhra Pradesh : ఏపీలో పేద ప్రజలకు భారీ ఊరట.. 1.40 కోట్ల మందికి గ్రేట్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్షేమ పథకాలతో పాటు ప్రజారోగ్యంపైన కూడా దృష్టి పెట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి 1.4 కోట్ల మందికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను అందచేయాలని నిర్ణయించింది. దీనివల్ల వారికి పేదలకు అందించే పౌష్టికాహారం విషయంలోనూ, ఆరోగ్య పరమైన అంశాల్లోనూ ఈ కార్డు ఉపయోగపడనుంది. అలాగే ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కూడా ఈ కార్డు ఉపయోగపడేలా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఈ కార్డులు అందచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
సంక్షేమ పథకాలతో పాటు...
జనాభా నిర్వహణతో పాటు ప్రజారోగ్యం, పిల్లలకు పౌష్టికాహారంతో పాటు సంక్షేమ పథకాల విషయంలోనూ ఈ కార్డు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్మార్ట్ కార్డులకు క్యూ ఆర్ కోడ్ ఉండటంతో ఆల్ ఇన్ వన్ కార్డు గా పనిచేయనుంది. ఇక దీనివల్ల ప్రయోజనం పొందే కుటుంబాలకు అవసరమైన వైద్యంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అందించేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇందులో కుటుంబానికి సంబంధించిన అన్ని అంశాలు పొందుపర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పూర్తి వివరాలతో ఈ కార్డును...
ఈ కార్డులో మొత్తం ఇరవై నాలుగు అంశాలను చేర్చాలని చెప్పారు. పూర్తి వివరాలతో ఈ కార్డును పంపిణీ చేయాలని, జూన్ నెల నాటికి 1.4 కోట్ల మందికి ఫ్యామిలీ బెన్ ఫిట్ కార్డులను పంపిణీ చేస్తే వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి సులువవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కుటుంబంలో ఎందరున్నారు? ఏ ఏ ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు? పిల్లలు ఎంత మంది? కుటుంబ సభ్యుల వృత్తి వివరాలు కూడా ఉంటాయి కాబట్టి పేదరికం నిర్మూలన కోసం వారిని పీ4 పథకం కింద కూడా ఎంపిక చేసే అవకాశముంటుందన్న అభిప్రాయం కూటమి ప్రభుత్వంలో నెలకొంది. దీంతో ఏపీలోని పేద కుటుంబాలకు ఊరట లభించినట్లవుతుంది.